నాందేడ్ లో అర్థరాత్రినుంచి సంపూర్ణ లాక్ డౌన్..

By AN TeluguFirst Published Mar 25, 2021, 11:16 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య  పెరుగుతుండటంతో.. అధికారులు ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేశాయి. 

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య  పెరుగుతుండటంతో.. అధికారులు ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేశాయి. 

ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణకు అనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేశాయి. 

ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణకు ఆనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. 

అక్కడ నైట్ కర్ఫ్యూ విధించినా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదల లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవ్వాళ్టి లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవ్శాళ్లి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. 

ప్రజా రవాణా అంతా బంద్ కానుండగా.. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కిరాణా, పాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. 

మరోవైపు బీడ్ జిల్లాలోనూ రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులోకి రానుంది. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని బీడ్ కలెక్టర్ వెల్లడించారు. 

నాందేడ్ లో లాక్ డౌన్ ప్రభావం తెలంగాణపై పడింది. అక్కడ రవాణా వ్యవస్థపై కఠిన ఆంక్షలు విధించడంతో తెలంగాణ నుంచి వెల్తే వాహనాలపై ఈ ప్రభావం పడింది. అక్కడ ప్రజా రవాణా పూర్తిగా బంద్ అయింది. ప్రైవేట్ వాహానాలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. 
 

click me!