కేరళలో విషాదం: గ్లైడర్ కూలి ఇద్దరు మృతి

Published : Oct 04, 2020, 11:13 AM ISTUpdated : Oct 04, 2020, 06:34 PM IST
కేరళలో విషాదం: గ్లైడర్ కూలి ఇద్దరు మృతి

సారాంశం

కేరళ రాష్ట్రంలోని కొచ్చి తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం నాడు  గ్లైడర్ కూలి ఇద్దరు నౌకాదళ ఉద్యోగులు మరణించారు.  

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొచ్చి తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం నాడు శిక్షణ గ్లైడర్ కూలి ఇద్దరు నౌకాదళ ఉద్యోగులు మరణించారు.

ఐఎన్ఎస్ గరుడ నుండి టేకాఫ్ అయిన కాసేపటికే  శిక్షణ గ్లైడర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించినవారిలో లెఫ్టినెంట్ రాజీవ్  ఝా,  మరొకరిని సునీల్ కుమార్ గా గుర్తించారు. 

సాధారణ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్లైడర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సదరన్ నావల్ కమాండ్ బోర్డు విచారణకు ఆదేశించింది.

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికను రూపొందించనుంది.ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు అధికారులు.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం