సూపర్ స్ప్రెడర్ గా కర్ణాటక మెడికల్ కాలేజ్ పార్టీ... 182 చేరిన కరోనా కేసులు...

By AN TeluguFirst Published Nov 26, 2021, 1:11 PM IST
Highlights

ధార్వాడ్ లోని ఎస్ డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, Positive గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.

బెంగళూరు : కర్ణాటకలోని Dharwad Medical Collegeలో జరిగిన కళాశాల ఈవెంట్.. కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య.. తాజాగా 182కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు Corona examinationలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, వైరస్ బారిన పడినవారిలో చాలామంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపారు. 

ధార్వాడ్ లోని ఎస్ డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, Positive గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.

మరో 100 మందికి పైగా విద్యార్థులకు టెస్టు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. దీంతో ఇప్పటివరకు కాలేజీలో 182 మంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 17న కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. ఈ వేడుకలతోనే virus spread జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో చాలామంది ఇప్పటికే Two doses of vaccine తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే Quarantineలో ఉన్నారు.

వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి Blood sampleలను జీనోమ్ సీక్వెన్వింగ్ కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ కాలేజీలో మొత్తం 3000 వరకు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరందరికీ Virus testingలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇండియాలో 24 గంటల్లో 10,549 కోవిడ్ కేసులు: సగం కేసులు కేరళలోనే

ఇదిలా ఉండగా, ఇండియాలో గత 24 గంటల్లో 10,549 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,45,55,431కి చేరుకొన్నాయి. 488 రోజుల కనిష్ట స్థాయికి కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒక్క కేరళ రాష్ట్రంలోనే నిన్న 5,987 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో 384 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి.

దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,67468 చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.10,133 లక్షలకి చేరిందని icmr తెలిపింది.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 9,868 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,39,77,830 గా నమోదైంది.కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1 శాతంగా ఉన్నాయి.  యాక్టివ్ కేసులు 0.32 శాతంగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2020 మార్చి నుండి ఈ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.  రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 49 రోజులుగా 20 వేలకు దిగువన నమోదయ్యాయి. 
 

click me!