
బెంగుళూరు: ప్రేమికుల రోజున ఇద్దరు ఐఎఎస్ అధికారులు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన గౌతం 2008లో జాతీయ స్థాయిలో సివిల్స్ 23వ ర్యాంక్‌ను సాధించారు. ప్రస్తుతం ఆయన కర్ణాటకలో పనిచేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని దావరణగెరె జిల్లా కలెక్టర్‌గా గౌతం విధులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాలో సంచాయితీ సీఈఓగా పనిచేస్తున్న కేరళకు చెందిన ఆశ్వథితో గౌతం ప్రేమలో పడ్డారు. ఈ విషయంలో మరో ఐఎఎస్ అధికారి ఇరు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. దీంతో ఈ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు.
ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజున కేరళలోని క్యాలికట్‌లో ఇద్దరు ఐఎఎస్ అధికారులు పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన గౌతం తన స్వంత గ్రామంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.