కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప... అధిష్టానం గ్రీన్ సిగ్నల్

By telugu teamFirst Published Jul 25, 2019, 10:30 AM IST
Highlights

యడ్యూరప్ప గురువారం హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు  చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారి కోరికను మన్నించిన అధిష్టానం... ప్రభుత్వ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కర్ణాటక రాష్ట్రంలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకి తెరపడింది. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. బలపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో... అధికారం బీజేపీ వశమైంది. దీంతో... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. 

దీనిలో భాగంగానే యడ్యూరప్ప గురువారం హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు  చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారి కోరికను మన్నించిన అధిష్టానం... ప్రభుత్వ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గవర్నర్ ఆహ్వానించడమే తరువాయి... యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.

ఇక యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... ఇప్పటికే యడ్యూరప్ప తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాగా.. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఆయన తన మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రితోపాటు వీరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

click me!