పదవులు ఇచ్చేందుకే మంత్రుల రాజీనామాలు: సిద్ధరామయ్య

By Siva KodatiFirst Published Jul 9, 2019, 2:01 PM IST
Highlights

కర్ణాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరేందుకు సీఎల్పీలో నిర్ణయించామని తెలిపారు. 

వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని.. ఇది ఒక రకంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడటమేనన్నారు. ఈ క్రమంలో సిద్ధూ బీజేపీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామిక పద్ధతిలో కూల్చేందుకు ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు.

ఎమ్మెల్యేలకు భారీ స్ధాయిలో డబ్బుతో పాటు మంత్రి పదవులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని... ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

గతంలో మద్ధతు లేని కారణంగానే యడ్యూరప్ప కేవలం మూడు రోజుల్లోనే సీఎం పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే 20 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పినట్లుగానే... అందులో భాగంగానే తాజాగా 21 మంది మంత్రులు రాజీనామా చేశారన్నారు. అయినా అందరికీ మంత్రివర్గంలో చోటు కల్పించడం సాధ్యంకాదని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.     

click me!