తన వద్ద పనిచేసే బ్యూటీషియన్‌కు లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్..

Published : Sep 18, 2022, 04:07 PM IST
 తన వద్ద పనిచేసే బ్యూటీషియన్‌కు లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్..

సారాంశం

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సెలూన్‌లో పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సెలూన్‌లో పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపినట్టుగా ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది. వివరాలు.. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో మనోజ్‌కు సెలూన్ ఉంది. అయితే ఆ సెలూన్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. శనివారం మనోజ్ సెలూన్‌కు వచ్చి తనను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నిందితుడు మనోజ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపరు. లైంగిక వేధింపులతోపాటు ఇతర ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసినట్లు చెప్పారు. 

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. సదరు నేత గతంలో ఓ మంత్రికి సహాయకుడిగా ఉన్నాడని తెలిపింది. ఆ సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా పేర్కొంది. 

ఇక, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతడు వాయువ్య కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ మాజీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రితో అతడు కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్