అతను నా బంధువే.. కాస్త గట్టిగానే కొట్టా, విషయం పెద్దది చేయొద్దు : మీడియాకు డీకే విజ్ఞప్తి

By Siva KodatiFirst Published Jul 11, 2021, 9:49 PM IST
Highlights

కార్యకర్తపై చేయి చేసుకున్న ఘటనపై స్పందించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. అతను తనకు బంధువేనని, అవసరంగా అతనిని పెద్ద నేతను చేయొద్దని డీకే.. మీడియాకు విజ్ఞప్తి చేశారు. 

పార్టీ కార్యకర్తపై చేయి చేసుకోవడంపై దుమారం రేగిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఆ కార్యకర్త తన బంధువు అని, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తన భుజంపై చేయి వేయాలనుకున్నాడని.. తన బంధువే కావడంతో చేయి చేసుకున్నాను.. ఆ తరువాత భుజంపై చేయి వేయొద్దని చెప్పానని వెల్లడించారు. బంధువుల మధ్య అప్పుడప్పుడూ ఇలా జరుగడం సహజమేనని.. ఈ విషయానికి మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని శివకుమార్ చెప్పారు. అతడిని కాస్త గట్టిగా కొట్టిన మాట వాస్తమేనని డీకే అంగీకరించారు. కానీ.. ఈ ఆ దృశ్యాలను పదే పదే చూపించి అతడిని పెద్ద నేతగా మారుస్తున్నారని ఆయన ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, తన భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై డీకే శివకుమార్ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత జీ మాదెగౌడను పరామర్శించేందుకు ఇటీవల డీకే .. మాండ్యకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవడంతో.. శివకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అధికార బీజేపీ డీకేపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసింది. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ .. విషయాన్ని పెద్దది చేయవద్దని మీడియాను కోరారు.

click me!