భారీ వర్షాలు: అప్రమత్తమైన రాష్ట్రాలు, రంగంలోకి నేవీ

By narsimha lodeFirst Published Aug 9, 2019, 1:06 PM IST
Highlights

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో  భారత నావిక దళం తన సేవలను అందించనుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నావిక దళం పూర్తి ఏర్పాట్లు చేసింది.
 

బెంగుళూరు:మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో  భారత నావిక దళం తన సేవలను అందించనుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో నావిక దళం పూర్తి ఏర్పాట్లు చేసింది.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.  ఈ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న పెరియార్ నదిలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో  విమానాశ్రయాన్ని మూసివేశారు.

శుక్రవారం నాడు  రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ప్రభుత్వం సెలవును ప్రకటించింది.రాష్ట్రంలోని 14 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది కేరళ ప్రభుత్వం.

తిరువనంతపురం, త్రివేండ్రం మినహా అన్ని ప్రాంతాల్లో సెలవులను ప్రకటించింది.కేరళ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది ప్రభుత్వం. వాయనాడ్, ఇడుక్కి, మళప్పురం, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు.

కర్ణాటక సీఎం  యడియూరప్ప రాష్ట్రంలోని పునరావాస కేంద్రాల్లో బాధిత ప్రజలను కలిశారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలను కలుసుకొన్నారు.కర్ణాటక రాష్ట్రంలో వరదల కారణంగా 20 మంది మృతి చెందారు. గడగ్ లో ఒక రైతు వరదలో కొట్టుకుపోయాడు.కేరళలో  వరదల కారణంగా 25 మంది మృతి చెందారు. పలువురు అదృశ్యమైనట్టుగా వార్తలు వెలువడ్డాయి.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వరద బాధితులను 8 బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు.కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో సుమారు 60 మందిని వరదల నుండి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు.

భారీ వర్షాల నేపథ్యంలో కేరళ సీఎం విజయన్ శుక్రవారం నాడు విపత్తు నిర్వహణ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కర్ణాటక, గిరిదల్ తదితర ప్రాంతాల్లో ఇండియన్ ఎయి‌ఫోర్స్ టీమ్ పునరావాస కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది.

 25 మందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించింది. 15 మందిని ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో అధికారులు రక్షించారు.


 

click me!