
Karnataka Bestiality Case: ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన జమీర్ ఖాన్.. అతన్ని వెళ్తున్న దారిని ఫాల్లో అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఒక భవనంలో మేకపై అసహజ లైంగికదాడికి పాల్పడటం చూసి, తన ఫోన్ లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. నిందితుడిని ఆటో డ్రైవర్ రూహిద్ అహ్మద్ గా గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని రామనగర జిల్లా చన్నపట్న నగరంలో మేకతో అసహజ శృంగారంలో పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిని ఆటో డ్రైవర్ అయిన రూహిద్ అహ్మద్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇందిరా కాటేజ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న నిందితుడు, నిర్మాణంలో ఉన్న భవనం వెనుక మేకను తీసుకెళ్తుండగా జమీర్ ఖాన్ అనే వ్యక్తి గమనించాడు.
నిందితుడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో జమీర్ ఖాన్ నిందితుడిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలోనే నిందితుడు రూహిద్ అహ్మద్ మేకతో అసహజ శృంగారం చేయడం, మేకను హింసించడాన్ని గమనించాడు. జమీర్ ఖాన్ తన మొబైల్‌లో ఈ చర్యను రికార్డ్ చేసి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో సంబంధిత అంశం వైరల్ గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పురా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.