బెంగ‌ళూరులో వీధి కుక్క‌ల పంజా.. మూడేళ్లలో 79,057 మంది దాడి

By Mahesh RajamoniFirst Published Jan 19, 2023, 11:44 AM IST
Highlights

Bangalore: బెంగ‌ళూరులో వీధి కుక్క‌ల పంజా విసురుతున్నాయి. గ‌త మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్క‌లు దాడి చేశాయ‌ని అధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది. దీంతో నగరంలోని కొన్ని వీధుల్లో నడిచేందుకు కూడా భయానక వాతావరణం నెలకొంది. 
 

Stray dog menace in Bengaluru: బెంగళూరులో గత మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఇప్పటివరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నష్టపరిహారం చెల్లించి 28 మంది వైద్య ఖర్చులను భరించింది. బాధితుల కోసం మొత్తం రూ.6,81,468 ఖర్చు చేసింద‌ని అధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. బెంగ‌ళూరులో వీధి కుక్క‌ల పంజా విసురుతున్నాయి. గ‌త మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్క‌లు దాడి చేశాయ‌ని అధికారికి రిపోర్టులు పేర్కొంటున్నాయి. అన‌ధికారికి లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంది. దీంతో నగరంలోని కొన్ని వీధుల్లో నడిచేందుకు కూడా భయానక వాతావరణం నెలకొంది. న‌గ‌ర పాల‌క సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. బెంగళూరులో గత మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఇప్పటివరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నష్టపరిహారం చెల్లించి 28 మంది వైద్య ఖర్చులను భరించింది. బాధితుల కోసం మొత్తం రూ.6,81,468 ఖర్చు చేసింద‌ని అధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మే 31న టీ.దాసరహళ్లిలోని ఏజీబీ లేఅవుట్ లో మూడేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు అదృష్టవశాత్తు బాలుడిని కాపాడాడు. బెంగళూరు నగరంలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. గత మూడేళ్లలో 79,057 మంది వీధి కుక్కల  దాడి బారిన‌పడ్డారు. బెంగళూరు నగరంలోని కొన్ని వీధుల్లో కూడా భయానక వాతావరణం నెలకొంది. వీధి కుక్కలు కూడా బైకర్లపై దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల క్రూరత్వం కారణంగా రాత్రిపూట రోడ్డుపై నడవడం కూడా భయపెడుతోంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మేల్కొనే బీబీఎంపీ అధికారులు ఆ తర్వాత మౌనంగా ఉంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికీ న‌గ‌రంలోని చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు వీధి కుక్క‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక దాడులు జ‌రిగిన త‌ర్వాత కూడా ఈ సమస్యకు పరిష్కారం ల‌భించ‌లేదు. బెంగళూరులో గత మూడేళ్లలో 79,057 మంది వీధి కుక్కల దాడికి గుర‌య్యారు. 2019-20లో నమోదైన కేసులు: 42,818గా ఉండ‌గా,  2020-21లో 18,629కేసులు, 2021-22లో  17,610 మంది వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు.

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో 14,489 మంది వీధి కుక్కల దాడి బారిన పడ్డారు. ఇప్పటివరకు 28 మందికి వైద్య ఖర్చులు, నష్టపరిహారం సొమ్మును బీబీఎంపీ పంపిణీ చేసింది. మొత్తం రూ.6,81,468 ఖ‌ర్చు ప‌రిహారం ఇచ్చారు. వీరి వైద్యం ఖ‌ర్చులు సైతం భారీగానే ఉంటాయి. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు బీబీఎంపీ, పట్టణ స్థానిక సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కానీ అవి పూర్తిగా ప్రభావవంతంగా లేవు. పట్టణ స్థానిక సంస్థలు వీధికుక్కలపై సర్వే నిర్వహించి, వాటిని పట్టుకుని అనువైన ప్రదేశాల్లో ఉంచడం, టీకాలు వేయడం వంటివి చేస్తున్నాయి. స్టెరిలైజేషన్ చికిత్సను పశువైద్యులు లేదా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థలు అందిస్తాయి. జంతువుల జనన నియంత్రణలో తగిన శిక్షణ పొందుతాయి. రేబిస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ చర్యలు వీధి కుక్కల బెడదను అరికట్టలేకపోయాయి. ఇంకా మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌లు కోరుతున్నారు. 

click me!