సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం..

By AN TeluguFirst Published Apr 24, 2021, 11:26 AM IST
Highlights

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ ఆంక్షల కారణంగా  భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ చిన్న కార్యక్రమంలో.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ ఆంక్షల కారణంగా  భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ చిన్న కార్యక్రమంలో.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. 
కాగా జస్టిస్ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

కోవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్‌వీ రమణ మాట్లాడారు. వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని అంటూ జస్టిస్ రమణ ఉద్వేగానికి గురయ్యారు. జస్టిస్‌ బోబ్డే మేథస్సు, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు.

బోబ్డేకు విభిన్న అభిరుచులు ఉన్నాయని, దీంతో పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనే దానిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఆయన చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని రమణ ఆకాంక్షించారు.

మారుతున్న కాలంతో పాటు, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే ఈ-కోర్టులను ప్రారంభించారని, మహమ్మారి విజృంభిస్తున్నా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని జస్టిస్ రమణ కొనియాడారు.  

click me!