చపాతి పిండిలో విషం కలిపి.. జిల్లా జడ్జికి పెట్టి..

By telugu news teamFirst Published Jul 30, 2020, 11:40 AM IST
Highlights

న్యాయమూర్తి కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా పూజ చేస్తానని ఈనెల 20న త్రిపాఠీని నమ్మబలికిన నిందితురాలు పూజ చేసేందుకు గోధుమ పిండిని తీసుకురావాలని కోరింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఆయనకు ఇవ్వగా మహిళ ఇచ్చిన గోధుమపిండితో చేసిన చపాతీలను తిన్న న్యాయమూర్తి త్రిపాఠి, ఆయన కుమారుడు అస్వస్థతకు లోనయ్యారు.

చపాతి పిండిలో విషం కలిపి ఓ మహిళ జిల్లా జడ్జి, ఆయన కుమారుడి మరణానికి కారణమైంది. కాగా.. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం బెతుల్ జిల్లా జడ్జి మహేంద్ర త్రిపాఠి, ఆయన కుమారుడు విషం కలిపిన చపాతీలు తిని చనిపోయారు. కాగా.. న్యాయమూర్తి త్రిపాఠికి గతంలో చింద్వారాలో పనిచేసిన సమయంలో అక్కడ ఎన్జీవోను నిర్వహించే మహిళ సంధ్యా సింగ్‌ (45)తో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే న్యాయమూర్తి కుటుంబం బెతుల్‌లో ఆయనతో కలిసి నివసిస్తుండటంతో నాలుగునెలలుగా సంధ్యా సింగ్‌ త్రిపాఠీని కలుసుకోలేకపోయారు.

దీంతో త్రిపాఠీ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే కసితో ఆమె రగిలిపోయింది. న్యాయమూర్తి కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా పూజ చేస్తానని ఈనెల 20న త్రిపాఠీని నమ్మబలికిన నిందితురాలు పూజ చేసేందుకు గోధుమ పిండిని తీసుకురావాలని కోరింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఆయనకు ఇవ్వగా మహిళ ఇచ్చిన గోధుమపిండితో చేసిన చపాతీలను తిన్న న్యాయమూర్తి త్రిపాఠి, ఆయన కుమారుడు అస్వస్థతకు లోనయ్యారు.

 వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా ఈనెల 25న తండ్రీ, కుమారులు మరణించారు. చపాతీలను తిన్న రెండో కుమారుడు సైతం అస్వస్ధతకు గురై చికిత్స పొందుతున్నారు. త్రిపాఠి భార్య ఆ రోజు చపాతీలు తినకుండా రైస్‌ తీసుకోవడంతో బతికిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు సంధ్యా సింగ్‌ ఆమె డ్రైవర్‌ సంజూ, ఆమెకు సహకరించిన దేవీలాల్‌ చంద్రవంశి, ముబిన్‌ ఖాన్‌, కమల్‌లను అరెస్ట్‌ చేశారు.
 

click me!