గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్ మంజూరు..

Published : Apr 29, 2022, 04:21 PM IST
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్ మంజూరు..

సారాంశం

గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని బర్పెట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహిళా పోలీసుపై దాడి కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని బర్పెట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహిళా పోలీసుపై దాడి కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.  ఇక, జిగ్నేష్ మేవాని రేపు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘‘కోక్రాఝర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత మొదటి కేసులో లాంఛనాలు ఇంకా పూర్తికానందున అతను రేపు (శనివారం) విడుదలయ్యే అవకాశం ఉంది’’ అని ఎమ్మెల్యే న్యాయవాది అంగ్షుమన్ బోరా చెప్పారు. 

తొలుత గతవారం గుజరాత్‌లోని పాలంపూర్ ప్రాంతంలో జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ జిగ్నేష్ మేవానీ చేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అస్సాంలోని కోక్రాఝర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏప్రిల్ 25వ తేదీన బెయిల్ మంజూరు చేశారు.

అయితే బెయిల్ పొందిన కొద్ది సేపటికే పోలీసులు కొత్త కేసులో జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. మహిళా పోలీసు అధికారిపై దాడి చేసి దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుకు సబంధించి జిగ్నేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రిజర్వులో పెట్టింది. ఈ క్రమంలోనే నేడు జిగ్నేష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

ఇక, ప్రధాని మోదీపై ట్వీట్స్ చేసిన కేసులో బెయిల్ లభించిన రోజు జిగ్నేష్ మాట్లాడుతూ.. ‘‘ ఇది బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర. నా ప్రతిష్టను దిగజార్చేందుకు వారు ఇలా చేశారు. వారు ఒక క్రమపద్దతిలో ఇలా చేశారు. రోహిత్ వేములకి చేశారు.. చంద్రశేఖర్ ఆజాద్‌కి చేశారు.. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు" అని మిస్టర్ మేవానీ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !