అడవిలో అమ్మాయిపై మిత్రుడితో సహా 9 మంది అత్యాచారం

Published : Mar 27, 2020, 09:23 AM ISTUpdated : Mar 27, 2020, 09:37 AM IST
అడవిలో అమ్మాయిపై మిత్రుడితో సహా 9 మంది అత్యాచారం

సారాంశం

జార్ఖండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దగ్గరి దారంటూ అమ్మాయిని తన బైక్ మీద ఎక్కించుకుని అడవిలోకి మిత్రుడు దారి తీశాడు. అడవిలో మిత్రుడి సహా 9 మంది ఆమెపై అత్యాచారం చేశారు.

దుమ్కా: జార్ఖండ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మిత్రుడితో సహా 9 మంది 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. దగ్గరి దారి అంటూ అడవిలోకి తీసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అమ్మాయిపై అత్యాచంర చేసినవారిని పట్టుకోవడానికి దాడులు నిర్వహించినట్లు పోలీసు సూపరింటిండెంట్ వైఎస్ రమేష్ చెప్పారు.

తనపై జరిగిన అఘాయిత్యంపై అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. మిత్రుడు తప్ప మిగతా వారు తనకు తెలియదని ఆమె చెప్పింది.

బాలిక పోలీసులు చేసిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి.... ఇద్దరు మిత్రులు టూవీలర్ పై దుమ్కాకు ఆమెను మంగళవారం సాయంత్రం సమీపంలోని గ్రామం తీసుకుని వెళ్లారు. తనను తన ఊరికి తీసుకెళ్లాల్సిందిగా ఆమె మరో మిత్రుడిని కోరింది. అతను తనతో పాటు మరో వ్యక్తిని తీసుకుని వచ్చాడు.

పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారని, అడవిలోంచి దగ్గరి దారి ఉందని, ఆమెను అతను అడవిలోకి తీసుకుని వెళ్లాడు. అడవిలో ఆమెకు ఏడుగురు వ్యక్తులు కనిపించారు. వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ తప్పి పడిపోగానే పారిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్