నేనేమైనా పారిపోతానా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా ట్రీట్ చేస్తారా : ఈడీపై హేమంత్ సోరెన్ ఫైర్

Siva Kodati |  
Published : Nov 17, 2022, 02:45 PM IST
నేనేమైనా పారిపోతానా.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా ట్రీట్ చేస్తారా : ఈడీపై హేమంత్ సోరెన్ ఫైర్

సారాంశం

తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భగ్గుమన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రినని, తనలాంటి వారిని ఇలా ట్రీట్‌ చేస్తారా అంటూ ఫైరయ్యారు.   

ఈడీ కేసులు, ఐటీ సోదాల నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ కుట్ర ఫలితంగానే తనపై అక్రమ కేసులు నమోదయ్యాయన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో వున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సమన్లు పంపడం ఇలాగేనా అని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. తనను విదేశాలకు పారిపోయే వ్యక్తిలా దర్యాప్తు సంస్థలు ట్రీట్ చేస్తున్నాయని ఆయన భగ్గుమన్నారు. 

వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలే దేశం విడిచి పారిపోయారని.. ఒక్క రాజకీయ నాయకుడు అలా పారిపోయిన దాఖలాలు లేవని హేమంత్ సోరెన్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని సంకీర్ణ కుటుంబాన్ని కూల్చడమే బీజేపీ పెద్దల లక్ష్యమని ఆయన ఆరోపించారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు సోరెన్ విజ్ఞప్తి చేశారు. 

ALso REad:జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో 77 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

ఇకపోతే.. జార్ఖండ్ లో వివిధ వర్గాలకు కల్పిస్తున్న మొత్తం రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది. దీని కోసం ఆ ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో జార్ఖండ్ పోస్టులు, సేవలలో ఖాళీల రిజర్వేషన్ చట్టం- 2001కి చేసిన సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం ఎస్టీ, ఎస్సీ, ఈబీసీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతం నుంచి 77 శాతానికి పెరగనున్నాయి.

రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని బిల్లు ప్రతిపాదించింది. ప్రతిపాదిత రిజర్వేషన్‌లో ఎస్సీ కమ్యూనిటీలోని స్థానిక ప్రజలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీలు) 15 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీలను మినహాయించి ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా లభించనుంది. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఎస్టీలకు 26 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, ఎస్సీలకు 10 శాతం కోటా లభిస్తోంది. ఓబీసీలు ప్రస్తుతం రాష్ట్రంలో 14 శాతం కోటాను పొందుతున్నారు. ఇలా రిజర్వేషన్లు పెంచుతామని 2019 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పాలక కూటమితో పాటు అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్