ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది జూలై 18-23 మధ్య నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగష్టు మాసంలో జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది జూలై 18-23 మధ్య నిర్వహించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగష్టు మాసంలో జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఇవాళ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.ఐఐటీ -జేఈఈ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలపై కూడ కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది జూలై 26వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
undefined
ఐఐటీ -జేఈఈ మెయిన్స్ పరీక్షలను జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఆగష్టు మాసంలో నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. కానీ, ఏ రోజున ఈ పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ తేదీని తర్వాత ప్రకటించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు పలుు ప్రవేశ పరీక్షలను రద్దు చేశాయి. ఐఐటీ -జేఈఈ , నీట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో ఇతర రాష్ట్రాలు కూడ పరీక్షల షెడ్యూల్ కూడ ప్రకటించే అవకాశం ఉంది.
also read:కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా
పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలపై కూడ బోర్డు నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ ఏడాది నీట్ పరీక్షల కోసం 15 లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం 9 లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు.