JEE Advanced Result 2023: ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి టాప్ ర్యాంక్.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

Published : Jun 18, 2023, 10:25 AM ISTUpdated : Jun 18, 2023, 11:26 AM IST
JEE Advanced Result 2023: ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి  టాప్ ర్యాంక్.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

సారాంశం

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం(జూన్ 18) విడుదల అయ్యాయి.

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం(జూన్ 18) విడుదల అయ్యాయి. ఈ నెల 4వ తేదీన పరీక్షను నిర్వహించగా ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేశారు. తాజాగా ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు  అధికారిక వెబ్‌సైట్ www.jeeadv.ac.inలో ఫలితాలను చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత జేఈఈ అడ్వాన్స్ రోల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇక, ఫలితాలతో పాటు పరీక్షకు సంబంధించిన తుది కీని కూడా విడుదల చేశారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇక, ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన వావిలా చిద్విలాస్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. అతడు 360 గానూ 341 మార్కులు సాధించారు. ఇక, అమ్మాయిల కేటగిరిలో 298/360 స్కోరు సాధించిన నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచారు. ఆమె కూడా హైదరాబాద్ జోన్‌కు చెందినవారే. అయితే కామన్ ర్యాంక్ లిస్ట్‌లో ఆమె 56వ స్థానంలో నిలిచారు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ల జాబితా.. 
1. వావిలాల చిద్విలాస్ రెడ్డి
2. రమేష్ సూర్య తేజ
3. రిషి కల్రా
4. రాఘవ్ గోయల్
5. బిక్కిన అభినవ్ చౌదరి
6. మలయ్ కెడియా

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu