ఢిల్లీలో దారుణం: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడికి దేహశుద్ధి

Published : Sep 01, 2021, 07:54 AM IST
ఢిల్లీలో దారుణం: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడికి దేహశుద్ధి

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జీన్స్ తయారీ కర్మాగారంలో పనిచేసే కార్మికుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అతన్ని పట్టుకుని కుటుంబ సభ్యులు, స్థానికులు దేహశుద్ధి చేశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని బాపా నగర్ ప్రాంతంలో పాతికేళ్ల వయస్సు గల యువకుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఆ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా యువకుడు స్వీట్లు ఇస్తానని చెప్పి బాలికను జీన్స్ తయారీ కర్మాగారంలోకి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు.

నిందితుడు ఆ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సంఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

కుటుంబ సభ్యులు, స్థానికులు ఫ్యాక్టరీలోకి వెళ్లి నిందితుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం