విలాస జీవితం కోసం భార్య డిమాండ్లు: దొంగగా మారిన భర్త

By narsimha lodeFirst Published Nov 30, 2020, 9:08 PM IST
Highlights

భార్య డిమాండ్లను తీర్చడానికి ఓ భర్త దొంగగా మారాడు. తన భార్యకు విలాసవంతమైన జీవితాన్ని అందించేందుకు దొంగతనాలు చేస్తూ జైలు పాలయ్యాడు.

సూరత్: భార్య డిమాండ్లను తీర్చడానికి ఓ భర్త దొంగగా మారాడు. తన భార్యకు విలాసవంతమైన జీవితాన్ని అందించేందుకు దొంగతనాలు చేస్తూ జైలు పాలయ్యాడు.

గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులు దిద్దే పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 

బల్వంత్ చౌహాన్ భార్య జల్సా జీవితానికి అలవాటు పడింది. సాధారణ జీవితం ఆమెకు నచ్చలేదు. తన అక్క ధనవంతురాలు. ఆమె అక్క జీవితంతో తన జీవితాన్ని పోల్చుకొనేది. 

తన సోదరి భర్త బిల్డర్. దీంతో ఆ కుటుంబం చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉండేవి. సోదరి కుటుంబంతో తన జీవితాన్ని ఆమె పోల్చుకొనేది. తన సోదరి కుటుంబంతో పోల్చుతూ భర్తను రోజూ సాధించేది.

భార్య వేధింపులు భరించలేక చౌహాన్ బైకుల దొంగతనాలను ప్రారంభించాడు. లాక్ డౌన్ కారణంగా చౌహాన్  ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఆయన బైకుల దొంగతనాన్ని పూర్తి కాలం మొదలుపెట్టారు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019 లో నాలుగు, 2020లో 25 బైకుల్ని దొంగిలించాడు. ఈ నెల 29వ తేదీన బైకు దొంగతనం చేస్తూ  ఆయన పట్టుబడ్డాడు. 


 

click me!