
Jawaharlal Nehru Statue Vandalised: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ కూడలిలో ఉన్న దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని కొంతమంది సంఘవిద్రోహశక్తులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ నేతలు నెహ్రూ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నెహ్రూ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సత్నా జిల్లాలోని సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధావరి కూడలి సమీపంలోని భారత మాజీ ప్రధాని విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం సంఘ వ్యతిరేక వ్యక్తులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. విగ్రహంపై సంఘ వ్యతిరేకులు ధ్వంసం చేయడంతో పాటు సీఎం శివరాజ్ సింగ్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయడం వైరల్ వీడియోలో కనిపిస్తోంది.
దీంతో బుధవారం నెహ్రూ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. అనంతరం సీఎస్పీతోపాటు కొత్వాలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేసినట్టు పోలీసులు హామీ ఇచ్చారు.
అనంతరం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, "ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందినది. కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు దేశ మాజీ ప్రధాని విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు, స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూ. ఈ సంఘటన అత్యంత ఖండనీయం. అని రాసుకోచ్చారు. అలాగే..నెహ్రూజీ విగ్రహంపై కొందరు సంఘ వ్యతిరేకులు కర్రలతో దాడి చేయడం, రాళ్లు రువ్వడం వంటివి వీడియోలో కనిపిస్తున్నాయి.
ఈ కేసులో తక్షణమే చర్యలు తీసుకున్న పోలీసులు, ప్రధాన నిందితులలో ఒకరితో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు 22 కృష్ణకాంత్ గౌతమ్ సోనౌరా గ్రామ నివాసి అని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇతర నిందితుల్లో శుభమ్ శుక్లా, సుభాష్ సింగ్, వివేక్ సింగ్, విషన్ మాంఝీ మరియు ప్రభాత్ బగ్రీ ఉన్నారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినందున ఆ మహనీయుడిని అవమానించినట్లుగా భావించిన, NSUI విగ్రహాన్ని ప్రక్షాళన చేయనుంది. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు అశుతోష్ చౌక్సే, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మంజుల్ త్రిపాఠి సమక్షంలో మాజీ ప్రధాని దివంగత జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాన్ని శుద్ధి చేయనున్నట్లు ఎన్‌ఎస్‌యుఐ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గౌరవ్ సింగ్ తెలిపారు.