Today Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ సోర్టీస్ లో జోరందుకున్న RRR ప్రాజెక్ట్.. అమెజాన్ ప్రైమ్ కు భారీ షాక్ ఇచ్చిన 'పుష్ప', తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్ధితి విషమం.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్, వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ నోటీసులు, సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు, ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా.. వంటి పలు వార్తల సమాహారం
Regional Ring Road: జోరందుకున్న RRR ప్రాజెక్టు
RRR: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు(RRR) పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని, అడ్డంకులన్నీ అధిగమించి, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.నిలిచిపోయిన భూసేకరణను రాబోయే మూడు నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూమిని సేకరించారు.
తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్ధితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని పరిస్ధితి విషమంగానే వుందని.. మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్..
తెలంగాణ కాంగ్రెస్ (telangana congress)నాయకత్వం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది (Two MLC candidates have been finalized). ఎమ్మెల్యే కోటాలో పార్టీ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ (addanki dayakar), ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (NSUI telangana president balmuri venkat)లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది.
కవితకు మరోసారి ఈడీ నోటీసులు
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గతంలో భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందని కూడ అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. గత ఏడాదిలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విషయమై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు తదుపరి నోటీసులు జారీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది.ఈ క్రమంలోనే వై.ఎస్. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది పార్టీ నాయకత్వం. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆంధ్రప్రదేశ్ వాసులు ఆ పార్టీని రాజకీయంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడ వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం పార్టీల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరూ మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ నేతలు కూడ అంతగా యాక్టివ్ గా లేరు.
పాలసముద్రంలో నాసిన్ కేంద్రం ప్రారంభించిన మోడీ
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థనే నాసిన్ అని పిలుస్తారు. 541 కోట్లతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2015లో నాసిన్ కు శంకుస్థాపన చేశారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సంస్థను ప్రారంభించారు.నాసిన్ శిక్షణ కేంద్రంపై లఘు చిత్రాన్ని అధికారులు ప్రదర్శించారు. నాసిన్ అనేది అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం.అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధికారులకు నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు.503 ఎకరాల విస్తీర్ణంలో నాసిన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు. నాసిన్ ఆవరణలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి కూడ కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. నాసిన్ వద్ద కేంద్రీయ విద్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రికి కూడ స్థలాలను ఎంపిక చేశారు.
సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారంనాడు కీలక తీర్పును వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు నివేదిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.జస్టిస్ బేలా త్రివేది మాత్రం చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు. జస్టిస్ అనిరుద్ద బోస్ మాత్రం 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని తీర్పు చెప్పారు.ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ ను ద్విసభ్య దర్మాసనం కోరింది. సెక్షన్ 17 ఏ అన్వయించడంతో తమకు భిన్నాభిప్రాయాలున్నాయని జడ్జిలు అభిప్రాయపడ్డారు. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
ఎంఎస్ ధోనీపై పరువు నష్టం దావా..
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు అయ్యింది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. పరువుకు భంగం కలిగించాడని వీరు కోర్టును ఆశ్రయించారు
#Pushpa2:అమెజాన్ ప్రైమ్ కు భారీ షాక్ ఇచ్చిన 'పుష్ప'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ హాట్ హాట్ గా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ రైట్స్ తమకే అని నెట్ ప్లిక్స్ ప్రకటించింది.