లోయలోపడిన బస్సు..31మంది మృతి

Published : Jul 01, 2019, 10:22 AM IST
లోయలోపడిన బస్సు..31మంది మృతి

సారాంశం

జమ్మూ కశ్మీర్ లో ఘెర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 31మంది ప్రాణాలు కోల్పోయారు. 

జమ్మూ కశ్మీర్ లో ఘెర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 31మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడటంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. తొలుత 25మంది చనిపోగా.. తర్వాత వారి సంఖ్య 31కి చేరింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. 

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతదేహాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?