
Jammu and Kashmir: అభివృద్ధిని వేగవంతం చేయడానికే జమ్మూకాశ్మీర్ వచ్చానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్ లో 20 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఈ పర్యటనలో ప్రధాని ప్రారంభించారు. కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించనున్న 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ & 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు కొనసాగుతున్నాయి. దాదాపు 20,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
జమ్మూకాశ్మీర్ పల్లిలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని ర్యాలీకి ఫూల్‌ప్రూఫ్ భద్రతలో భాగంగా బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత, సరిహద్దు పోస్టుల పర్యటన మినహా, ప్రధాని మోడీ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లడం ఇదే తొలిసారి. జమ్మూపర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "ఈ సంవత్సరం పంచాయితీ రాజ్ దినోత్సవం.. జమ్మూకాశ్మీర్ లో జరుపుకోవడం ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. జమ్మూకాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరుకున్నప్పుడు, నేను ఇక్కడి నుండి మీ అందరితో సంభాషిస్తున్నాను, ఇది చాలా గర్వించదగిన విషయం" అని ప్రధానమంత్రి మోడీ అన్నారు.
"ప్రజాస్వామ్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు.. నేడు జమ్మూ కాశ్మీర్ కొత్త ఉదాహరణగా నిలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో గత 2-3 ఏళ్లలో అభివృద్ధిలో కొత్త కోణాలు సృష్టించబడ్డాయి" అని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. సాంబా జిల్లాలోని పల్లిలో 500 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో, కార్బన్ న్యూట్రల్‌గా మారిన దేశంలోనే మొదటి పంచాయతీగా అవతరిస్తోంది... పల్లి ప్రజలు 'సబ్కా ప్రయాస్' ఏమి చేయగలరో నిరూపించారు అని ప్రధాని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి 20,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించడం జరిగిందని సాంబలోని పల్లి గ్రామంలో ప్రధాని అన్నారు. అలాగే, 'అమృత్ సరోవర్ మిషన్'ని కూడా ప్రారంభించారు. సాంబాలో గెలిచిన పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు జాతీయ పంచాయతీ అవార్డు మొత్తాన్ని బదిలీ చేశారు.
3100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బనిహాల్-ఖాజిగుండ్ రోడ్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన INTACH ఫోటో గ్యాలరీని సందర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 జలవనరులను అభివృద్ధి చేయడం మరియు పునరుజ్జీవింపజేయడం లక్ష్యంగా పెట్టుకున్న 'అమృత్ సరోవర్ మిషన్'ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 3,100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ టన్నెల్‌ను ప్రధాని ప్రారంభించారు. 8.45 కి.మీ పొడవైన సొరంగం బనిహాల్ మరియు ఖాజిగుండ్ మధ్య రహదారి దూరాన్ని 16 కి.మీ తగ్గిస్తుంది.. ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది.