రూ.10కోట్లు డిమాండ్.. ఎమ్మెల్యే అరెస్టు

By ramya neerukondaFirst Published Jan 23, 2019, 11:06 AM IST
Highlights

ఓ బిల్డర్ ని రూ.10కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. 

ఓ బిల్డర్ ని రూ.10కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మొహాలి నగరంలో చోటుచేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ గతంలో పెద్ద రౌడీగా చలమాణీ అయ్యేవారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి రౌడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా.. అతనిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

రూ.10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ తనను బెదిరించాడని మొహాలీ నగరంలోని సెక్టార్ 70కి చెందిన ఓ బిల్డరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీపై ఐపీసీ సెక్షన్ 386, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

అనంతరం పెద్ద ఎత్తున సాయుధ పోలీసులను మోహరించి ఎమ్మెల్యే ముఖ్తార్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. గ్యాంగస్టర్ నుంచి రాజకీయనాయకుడిగా మారిన రౌడీ ఎమ్మెల్యే ముఖ్తార్ కు మెజిస్ట్రేట్ అమిత్ బక్షి రెండురోజుల పోలీసు కస్టడీకి పంపించారు. బిల్డరును బెదిరించిన ఎమ్మెల్యేపై బెదిరింపులు, ఆయుధాల చట్టాన్ని ప్రయోగించామని మొహాలీ ఎస్పీ కుల్దీప్ సింగ్ చాహల్ చెప్పారు.

ముఖ్తార్  అన్సారీ గతంలోనూ చాలాసార్లు జైలుకి వెళ్లారు. ఇప్పటికి ఆయనపై 45కేసులు ఉన్నాయి. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా కూడా ఆయన పేరు ఉంది. ఎమ్మెల్యే అరెస్టు ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

click me!