మైనారిటీలపై తొలిసారి‌గా ఇందిరా గాంధీ బుల్డోజర్‌లను ప్రయోగించారు: కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్

Published : May 08, 2022, 01:49 PM ISTUpdated : May 08, 2022, 02:01 PM IST
మైనారిటీలపై తొలిసారి‌గా ఇందిరా గాంధీ బుల్డోజర్‌లను ప్రయోగించారు: కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్

సారాంశం

దేశంలో బుల్డోజర్ వాడకంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బుల్డోజర్ వాడకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. 

దేశంలో బుల్డోజర్ వాడకంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బుల్డోజర్ వాడకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్ వద్ద మైనారిటీలపై బుల్డోజర్‌లను ఉపయోగించమని మొదట ఆదేశించింది ఇందిరా గాంధీ అని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ నేషన్ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా వరుస ట్వీట్స్ చేశారు. 

“కాంగ్రెస్ పార్టీలో మనీష్ తివారీ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ మతిమరుపుతో బాధపడుతున్నారా..? లేదా వారి గతం గురించి వారికి తెలియదా..? నాజీలు,  యూదులను మరచిపోండి.. భారతదేశంలో తుర్క్‌మాన్ గేట్ వద్ద మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ’’ అని అమిత్ మాల్వియా పేర్కొన్నారు.

‘‘1976 ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ.. ముస్లిం పురుషులు, స్త్రీలను బలవంతంగా స్టెరిలైజేషన్ చేయించుకోవాలని బలవంతం చేశాడు. వారు నిరసన వ్యక్తం చేసినప్పుడు తుర్క్‌మాన్ గేట్ వద్ద బుల్డోజర్లు ప్రయోగించడంతో 20 మంది మరణించారు’’ అని మాల్వియా ట్వీట్ చేశారు. నాజీలతో కాంగ్రెస్ రొమాంటిసిజం ఇందిరా గాంధీ వద్ద ఆగాలని చురకలు అంటించారు. 

 

ఇక, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ట్విట్టర్‌లో తాను రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘‘యూదులపై నాజీలు బుల్డోజర్‌ను విస్తృతంగా మోహరించారు. తర్వాత యూదులు దానిని పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఉపయోగించారు. ఇప్పుడు భారతదేశం.. దానిని తన సొంత మైనారిటీలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంది’’ అ మనీష్ తివారీ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా..  తుర్క్‌మన్ గేట్ వద్ద మైనారిటీలపై బుల్డోజర్‌లను ఉపయోగించమని మొదట ఆదేశించింది ఇందిరా గాంధీ అని అమిత్ మాల్వియా కౌంటర్ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం