
బెంగుళూరు: ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంపై ఐటీ అధికారులు కూడ ఓ కన్నేశారు. బెంగుళూరులోని ఓ హోటల్‌లో కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకొంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్‌ను ఐటీ అధికారులు పట్టుకొన్నారు.
బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నారాయణగౌడ్ పేరున ఉన్నరెండు రూమ్‌ల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 2కోట్లకు పైగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అతని ఇంటి నుండి రూ. 25 లక్షలను కూడ సీజ్ చేశారు. ఐటీ అధికారులకు చిక్కకుండా నారాయణ గౌడ్ పాటిల్ తప్పించుకొన్నారు.
కానీ, నారాయణగౌడ్ పాటిల్ కారు డ్రైవర్‌ను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు.అయితే నారాయణగౌడ పాటిల్ కోసం అధికారులు గాలిస్తున్నారు. నారాయణగౌడ్ పాటిల్‌తో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయి, రాజకీయపార్టీల నేతలు ఎవరైన కూడ నారాయణగౌడ్ పాటిల్‌తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఏఏ పార్టీలకు గౌడ్ డబ్బులు చెల్లించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్ వద్ద డబ్బులు లభించడంపై ఆ శాఖ మంత్రి కృష్ణబీర్ గౌడ్ ఏం చెబుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.