Aditya L1 mission: ఇస్రో మరో ప్రతిష్టాత్మక మిషన్.. నేడు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ఈ విషయాలు తెలుసా?

Published : Sep 02, 2023, 09:27 AM ISTUpdated : Sep 02, 2023, 12:54 PM IST
Aditya L1 mission: ఇస్రో మరో ప్రతిష్టాత్మక మిషన్.. నేడు ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ఈ విషయాలు తెలుసా?

సారాంశం

చంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత జోష్‌లో ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నేడు నింగిలోకి పంపనుంది.

చంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత జోష్‌లో ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టేందుకు సర్వం సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరపనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం కౌంట్‌డౌన్‌ మొదలైంది. కౌంట్‌డౌన్ ముగియగానే శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

ఆదిత్య ఎల్-1 ప్రయోగం గురించి ఈ విషయాలు తెలుసా?
-సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి ఉపగ్రహం ఇదే.
-ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 
-అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది. 
-ఈ ప్రదేశం నుంచి ఎలాంటి  అవరోధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే  వీలు ఉంటుంది. 
-ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలనిఇస్రో చూస్తుంది. 
-ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.

ఎల్-1 పాయింటే ఎందుకు..?
ఖగోళంలో పెద్ద వస్తువులకు దాని పరిమాణం బట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే.. భూమి కంటే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అయితే.. అది ఆ వస్తువు నుంచి దూరంగా జరుగుతున్నా కొద్దీ తగ్గుతుంది. సూర్యుడు, భూగ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 అనే పాయింట్ వద్ద దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే.. గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 పాయింట్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కాబట్టి, అక్కడ ఒక శాటిలైట్‌ను తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ కాలం ఆపరేట్ చేయవచ్చు. 

ఇక్కడి నుంచి సూర్యుడిని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా మనం వీక్షించుకోగలం. అంటే సూర్యగ్రహణం, ఇతర గ్రహాల వల్ల సూర్యుడిని తాత్కాలికంగా చూడలేని పరిస్థితులు ఈ పాయింట్ వద్ద ఉండవు.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations