నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-7A ఉపగ్రహం

Published : Dec 19, 2018, 04:34 PM IST
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-7A ఉపగ్రహం

సారాంశం

జీశాట్-7A ఉపగ్రహాన్ని బుధవారం నాడు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది.   


శ్రీహరికోట:  జీశాట్-7A ఉపగ్రహాన్ని బుధవారం నాడు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

జీశాట్-7A ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. 2013లో రోదసీలోకి పంపిన జీశాట్-7 ఉపగ్రహం కాలపరిమితి ముగిసినందున ఇవాళ ఈ ఉపగ్రహన్ని ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహన్ని రూపొందించారు.కమ్యూనికేషన్ల విభాగంలో ఇది 30వ, ఉపగ్రహంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉపగ్రహన్ని  జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.ఎనిమిదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది.


 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !