ఛాతీలోకి దూసుకెళ్లిన ఇనుప కడ్డీ: విజయవంతంగా తొలగించిన వైద్యులు

By narsimha lodeFirst Published Aug 30, 2019, 11:25 AM IST
Highlights

ప్రమాదవశాత్తూ ఓ యువకుడి ఛాతీలోకి ఇనుపకడ్డీ దూసుకెళ్ల గా.. వైద్యులు ఎంతో కష్టపడి విజయవంతంగా దానిని తొలగించారు.గురుస్వామికి అదృష్టవశాత్తూ సున్నిత భాగాల మీదుగా కడ్డీ దిగలేదని.. లేదంటే అతని ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత గురుస్వామిని ఐసీయూకి తరలించారు

ప్రమాదవశాత్తూ ఓ యువకుడి ఛాతీలోకి ఇనుపకడ్డీ దూసుకెళ్ల గా.. వైద్యులు ఎంతో కష్టపడి విజయవంతంగా దానిని తొలగించారు. వివరాల్లోకి వెళితే.. వడిపట్టిలోని అండిపట్టి బంగ్లా సమీపంలో నివసించే గురుస్వామి రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మధురైలో పనులు ముగించుకుని స్నేహితునితో పాటు బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో మేలావాసల్ సమీపంలో బైక్‌పై గురుస్వామి నియంత్రణ కోల్పోవడంతో పక్కనే వున్న గుంతలో పడిపోయాడు.

అందులో ఇనుప చువ్వలు ఉండటంతో నాలుగు అడుగుల ఇనుపకడ్డీ అతని ఛాతీలోకి దూసుకెళ్లింది. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో వెంటనే గురుస్వామిని 108లో రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు.

ముందుగా బాధితుడికి ట్రూమా సెంటర్‌లో ప్రథమ చికిత్స చేసి.. వెనువెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. వైద్యుల బృందం సుమారు 5 గంటల పాటు శ్రమించి అతని ఛాతీ నుంచి ఇనుపకడ్డీని తొలగించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి డీన్ డాక్టర్ వనిత మాట్లాడుతూ.. గురుస్వామికి అదృష్టవశాత్తూ సున్నిత భాగాల మీదుగా కడ్డీ దిగలేదని.. లేదంటే అతని ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత గురుస్వామిని ఐసీయూకి తరలించారు. అతనిని మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో వుంచి అనంతరం డిశ్చార్జి చేస్తామని డీన్ వెల్లడించారు.

click me!