ఉగ్రవాదాన్ని రాజకీయ సమస్యగా పరిగణించలేం.. వచ్చే 50 ఏళ్లకు ఇంటర్‌పోల్ ప్రణాళికలు.. 

By Rajesh KarampooriFirst Published Oct 22, 2022, 4:53 AM IST
Highlights

మారుతున్న నేరాల రీతులను ఎదుర్కొనేందుకు వచ్చే 50 ఏళ్లపాటు భావి ప్రణాళికలను రూపొందించాలని ఇంటర్‌పోల్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉద్బోధించారు. ఉగ్రవాదం మానవ హక్కులను అతి పెద్ద ఉల్లంఘించేదని, ఆన్‌లైన్ రాడికలైజేషన్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని సీమాంతర ప్రచారం చేయడాన్ని “రాజకీయ సమస్య”గా పరిగణించలేమని  ఆయన నొక్కి చెప్పారు.
 

 

ఢిల్లీలో జరిగిన ఇంటర్‌పోల్ 90వ సమావేశంలో భారత హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీలో పాశ్చాత్య దేశాల ప్రతినిధులతో హోంమంత్రి తీవ్రవాద అంశాన్ని గట్టిగా లేవనెత్తారు. ఉగ్రవాదాన్ని మనం విభిన్న దృక్కోణంలో చూడలేమని ఆయన అన్నారు. రాడికలైజేషన్ అనేది ప్రపంచ సమస్య అని, దానిని ఆ విధంగా చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదులు వివిధ రకాలుగా ఉండరనీ,అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారని ఆయన అన్నారు.

అన్ని సభ్య దేశాలలోని ఉగ్రవాద వ్యతిరేక,మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల మధ్య నిజ-సమయ సమాచార మార్పిడి రేఖను ఏర్పాటు చేయడానికి శాశ్వత యంత్రాంగాన్ని రూపొందించడానికి ఇంటర్‌పోల్ చొరవ తీసుకోవాలని హోం మంత్రి అన్నారు. నేటి యుగంలోని నేరాలు, నేరగాళ్లను అరికట్టాలంటే సంప్రదాయ భౌగోళిక సరిహద్దుల కంటే ఎక్కువగా ఆలోచించాలని హోంమంత్రి అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరుకు సీమాంతర సహకారం చాలా ముఖ్యమని హోంమంత్రి అన్నారు.

ఉగ్రవాదాన్ని రాజకీయ సమస్యగా పరిగణించలేం  

ఉగ్రవాదాన్ని అరికట్టాడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలన్న నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ రాడికలైజేషన్ ద్వారా సరిహద్దులు దాటి వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాద భావజాలం యొక్క సవాలుపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం కూడా అవసరమని ఆయన అన్నారు. ఈ సమస్యను రాజకీయ సమస్యగా పరిగణించలేమని హోంమంత్రి అన్నారు.


వచ్చే 50 ఏళ్లకు ఇంటర్‌పోల్ ప్రణాళిక  

ఇంటర్‌పోల్ గత 100 ఏళ్ల అనుభవాలు, విజయాల ఆధారంగా రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయాలని జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ హోంమంత్రి అమిత్ షా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక, మాదక ద్రవ్యాల వ్యతిరేక ఏజెన్సీల కోసం అంకితమైన కేంద్రం.. ఉగ్రవాద కట్టడి కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు ఇంటర్‌పోల్ కు భారత్ కు సహకరిస్తుంది. 
 

click me!