సూపర్ మహిళ: మావోల ఏరివేతకు అడవిలో ఎనిమిది నెలల గర్భిణీ

By narsimha lodeFirst Published Mar 8, 2020, 5:44 PM IST
Highlights

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నక్సల్ ఏరివేతలో  ఎనిమిది మాసాల గర్భిణీ  విధులు నిర్వహిస్తోంది.  ఎనిమిది మాసాల గర్భిణీ అందరి ప్రశంసలు అందుకొంటుంది. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు భారీ పోలీసు బలగాలను వినియోగిస్తోంది.
 

రాయ్‌పూర్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నక్సల్ ఏరివేతలో  ఎనిమిది మాసాల గర్భిణీ  విధులు నిర్వహిస్తోంది.  ఎనిమిది మాసాల గర్భిణీ అందరి ప్రశంసలు అందుకొంటుంది. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు భారీ పోలీసు బలగాలను వినియోగిస్తోంది.

మహిళా పోలీస్ కమాండోలు కూడ మావోల ఏరివేతలో చురుకుగా పాల్గొంటున్నారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ మహిళా కమాండర్ మావోల ఏరివేతలో పాల్గొంటున్నారు.

 ఏ మాత్రం భయం లేకుండా దట్టమైన అడవిలో తుపాకీ చేతబట్టి ఆమె కూంబింగ్ లో పాల్గొంటున్నారు. రెండు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే సునైనా మావోల ఏరివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.  తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే తన ముందు ఉన్న లక్ష్యమని పటేల్ చెప్పారు.

ఏకే-47 ఆయుధంతో పాటు సుమారు ఎనిమిది నుండి 10 కేజీల బరువున్న కిట్ బ్యాగ్ ను ఆమె ఉపయోగిస్తోంది. గతంలో కూడ ఆమె విధులు నిర్వహించిన సమయంలో గర్భస్రావమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణీగా ఉన్నందున ఆమెను వెంటనే కూంబింగ్  కు పంపకూడదని నిర్ణయం తీసుకొన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

 యాంటీ నక్సల్స్ స్క్వాడ్ లో మహిళలు చేరడంలో  సునైనా పటేల్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పోలీసులు ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు. 


 

click me!