ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం..  సోషల్ మీడియాలో యూజర్ల రచ్చ..

By Rajesh KarampooriFirst Published Sep 23, 2022, 1:21 AM IST
Highlights

సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్  డౌన్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్టా సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు గురువారం రాత్రి  నానా ఇబ్బందులు పడ్డారు.ఈ సమయంలో యాప్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు తమ పోస్టులను అప్డేట్ చేయలేకపోయారు. కొందరు యూజర్లు తమ ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయలేకపోయారు.  

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు గురువారం రాత్రి  అంతరాయం ఏర్పడింది.ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ యాప్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు తమ పోస్టులను అప్డేట్ చేయలేకపోయారు. కొందరు యూజర్లు తమ ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయలేకపోయారు. అలాగే..స్టోరీస్ ను అప్ లోడ్ చేయలేకపోయారు.

దీంతో అసహనానికి గురైన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్ డౌన్ కావడం వల్ల లాగిన్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని, ఫీడ్ కూడా రిఫ్రెష్ కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఇన్‌స్టా డౌన్ కావడం వల్ల యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు.
 
ఫోటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందని, యాప్ క్రాష్‌ను ఎదుర్కొంటున్నట్టు వినియోగదారులు పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు ఇన్‌స్టాను వారి ప్రాథమిక కమ్యూనికేషన్ యాప్‌గా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు దానిపై చిన్న వ్యాపారాలను కూడా నడుపుతున్నారు. యాప్ డౌన్ అయినప్పుడు దాని ఫీచర్‌ని ఉపయోగించడం ప్రజలకు కష్టంగా మారుతోంది. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన తర్వాత #instagramdownagain అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసింది. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినందుకు కంపెనీ కూడా విచారం వ్యక్తం చేసింది.మమ్మల్ని క్షమించండి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన విడుదల చేసింది.

డౌన్‌టైమ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్ట‌ర్ వెబ్ సైట్ యూజర్ల సమస్యలను వెల్లడించింది. దీని ప్రకారం..సెప్టెంబర్ 22న రాత్రి 10 గంటలకు ( భారత కాలమానం ప్రకారం) ప్రపంచవ్యాప్తంగా   Instagram సేవలు నిలిచిపోయాయి. చాలా మంది వినియోగదారులు Instagram యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు.

అవుట్‌టేజ్ డిటెక్షన్ సైట్ ప్రకారం.. నివేదించబడిన సమస్యలలో 87 శాతం యాప్‌తో సమస్యలు, 9 శాతం మంది యాప్ లాగిన్ సమస్యలు 4 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్లో  సమస్యలతో ఇబ్బంది పడినట్టు తెలిపింది. ఈ యాప్ లో  కొత్త ఫీచర్‌ను యాజమాన్యం పరీక్షిస్తోంది. అందుకే అంతరాయం ఏర్పడినట్టు వేదిక తెలిపింది. 

click me!