రైతులకు గ్రేటా థన్‌బెర్గ్ మద్ధతు: ఆ ఫైళ్లలో.. భారత వ్యతిరేక కుట్రకు టూల్‌కిట్

By Siva KodatiFirst Published Feb 4, 2021, 9:59 PM IST
Highlights

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ చేసిన ట్వీట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. రైతులకు మద్ధతుగా ఆమె చేసిన ట్వీట్‌లో జత చేసిన కొన్ని పత్రాలు.. భారత్‌పై జరుగుతున్న కుట్రను బయటపెట్టాయి. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది. 

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ చేసిన ట్వీట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. రైతులకు మద్ధతుగా ఆమె చేసిన ట్వీట్‌లో జత చేసిన కొన్ని పత్రాలు.. భారత్‌పై జరుగుతున్న కుట్రను బయటపెట్టాయి. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆమె ట్వీట్‌ను డిలీట్ చేసింది. 

ఈ పర్యావరణ కార్యకర్త అనుకోకుండా ట్విట్టర్‌లో పంచుకున్న ఎనిమిది పేజీల పత్రం... విదేశాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని కొనసాగించడానికి మాన్యువల్ వంటిది ఇచ్చింది. ఇందుకోంస ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులను సాకుగా వుపయోగించుకుంది. ఆందోళన వెనుక గల కారణాలు లేదా హేతుబద్ధత గురించి వారికి తెలియదా లేదా అనే దానితో సంబంధం లేకుండా రైతుల నిరసనపై ట్వీట్ చేయడానికి.. ముందుగా కల్పించిన టేంప్లేట్లు ప్రజలకు చేరినట్లు పత్రంలో వెల్లడించింది.

ఉదాహరణకు అమెరికన్ పాప్ స్టార్ రిహనా ట్వీట్ తీసుకోండి.. ‘‘మనము దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు’’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆమె ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌లో పొందుపరిచిన రిపబ్లిక్ డే ఘర్షణలపై సీఎన్ఎన్ కథనాన్ని ఆమె జోడించింది. గూగుల్ డ్రైవ్ నుంచి వచ్చిన ట్వీట్లను పోలి వుండే లాంటి పదాలను కేరళ మహిళా కాంగ్రెస్ యూనిట్ వాడినట్లుగా అనిపిస్తుంది. 

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ భారత పరిపాలనా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావడం గురించి సదరు మాన్యువల్‌లో సుదీర్ఘ ప్రస్తావన వుంది. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని హింసించడం, పాత్రికేయులను వేధించడం, కార్పోరేట్‌లకు అనుకూలంగా పౌరులను అణిచివేయడం వంటి అంశాలపై భారత్‌, దేశ ప్రభుత్వం పరువు తీయడంపై ఆ పత్రాల్లో దృష్టి పెట్టారు. 

ఇప్పటికీ, రిపబ్లిక్ డే రోజున రైతులు కొన్ని స్వార్థ  ప్రయోజనాల వల్ల అడ్డంకులను అధిగమించి చారిత్రాత్మక ఎర్రకోటను ముట్టడి చేయాలని ప్రేరేపించబడ్డారు. జనవరి 26న విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల దగ్గర రైతులకు మద్ధతుగా నిరసనలు, విధ్వంసం చర్యలకు ఈ మాన్యువల్ సాక్ష్యంగా నిలిచింది. ఈ విధ్వంసం చర్యలలో ఖలీస్తానీ అనుకూల వాదులు చురుగ్గా పాల్గొన్నారన్నది బహిరంగ రహస్యం.

కానీ తొమ్మిది పేజీల ‘‘టూల్ కిట్’’ (గ్రేటా థన్‌బెర్గ్ పిలిచినట్లుగా) పెద్ద కుట్రను ధ్రువీకరించింది. సదరు టూల్‌కిట్‌లో పొందుపరిచిన అనేక హైపర్ లింకులలో, పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ రూపొందించిన మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ వుంది. ఈ సంస్థను స్వయం ప్రతిపత్తి గల ఖలిస్తాన్ మద్ధతుదారు మో దాలివాల్ స్థాపించారు. 

ఆ ప్రజంటేషన్‌లో లిస్ట్ చేయబడిన ఎజెండాలో అసమ్మతికి ఫాసిస్ట్ ప్రతిస్పందనలు మరియు భారతదేశానికి చెందిన  యోగా, చాయ్ ఇమేజ్‌కు భంగం కలిగించడం వంటివి వున్నాయి. జనవరి 26న ప్రణాళికను అమలు చేయడంతో తదుపరి ఫిబ్రవరి 13-14 తేదీలలో మరో ఆపరేషన్ జరుగుతుంది. ఆ రోజున గ్రేటా థన్‌బెర్గ్, సహ కుట్రదారులు భారత రాయబార కార్యాలయాలు, మీడియా సంస్థలు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

రెండు రోజుల నుంచి ఈ కుట్రపై ఇప్పటికే ట్విట్టర్‌లో పెద్ద యుద్ధం మొదలైంది. వారు భారతదేశ రైతులు , ఇతర పౌరులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో వారు భారతదేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి వెనక్కి తగ్గుతోందని, ఫాసిజంలోకి చోచ్చుకెళుతోందని తద్వారా తిరోగమనం దిశగా వెళుతున్న దేశంగా భారతదేశాన్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. 
 

click me!