చిదంబరానికి చిక్కులు: అఫ్రూవర్‌గా ఇంద్రాణీ ముఖర్జీయా

Published : Jul 04, 2019, 03:36 PM IST
చిదంబరానికి చిక్కులు: అఫ్రూవర్‌గా ఇంద్రాణీ ముఖర్జీయా

సారాంశం

ఐఎన్ఎక్స్  మీడియా కేసులో  మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీయా అఫ్రూవర్ గా మారేందుకు  సీబీఐ కోర్టు అంగీకరించింది.  

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్  మీడియా కేసులో  మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీయా అఫ్రూవర్ గా మారేందుకు  సీబీఐ కోర్టు అంగీకరించింది.

ఈ మేరకు ఇంద్రాణీ ముఖర్జీయా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు అంగీకరించింది. ఇంద్రాణీ ముఖర్జీ తాను ఈ కేసులో అఫ్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను  సీబీఐ జడ్జి అరుణ్ భరద్వాజ్  గురువారం నాడు అనుమతిచ్చారు. 

ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. తమ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని  కోర్టు  ముఖర్జీయాను ఆదేశించింది. ఈ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?