కోరిక తీర్చమని వివాహితకు వేధింపులు.. ఒప్పుకోలేదని..

Published : Oct 01, 2018, 11:23 AM IST
కోరిక తీర్చమని వివాహితకు వేధింపులు.. ఒప్పుకోలేదని..

సారాంశం

యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు వివాహిత నిరాకరించింది. దీంతో హరినారాయణ వివాహితపై కోపంతో నిద్రపోతున్న వివాహిత ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు.

తన లైంగిక కోరిక తీర్చాలంటూ ఓ కామాంధుడు.. వివాహితను వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆమె కూతుళ్లపై లైంగిక దాడికి దిగాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. సాగర్ నగరానికి చెందిన ఓ వాచ్‌మెన్ తన భార్య, ఇద్దరు చిన్న కూతుళ్లతో కలిసి ఇండోర్ నగరానికి వలసవచ్చాడు.

 వాచ్ మెన్ కుటుంబానికి సమీప బంధువైన 20 ఏళ్ల యువకుడైన హరినారాయణచారి వివాహితను తన కోరిక తీర్చమని అడిగాడు. యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు వివాహిత నిరాకరించింది. దీంతో హరినారాయణ వివాహితపై కోపంతో నిద్రపోతున్న వివాహిత ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు.  సంవత్సరం వయసు ఉన్న చిన్నారిపై అత్యాచారినికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బాధిత బాలికలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన హరినారాయణను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే