భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది : ప్రధాని మోడి

Published : Oct 12, 2019, 03:12 PM IST
భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది : ప్రధాని మోడి

సారాంశం

చెన్నై కనెక్ట్' భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి నాంది పలకనుందని శుక్రవారం చైనా ప్రధాని తో జరిగిన అనధకారిక సమావేశం తరువాత భారత ప్రధాని మోది అన్నారు. ఇరు ప్రధానులు శుక్రవారం ఇప్పుడు మమల్లాపూర్ గా పిలవబడుతున్న మహాబలిపురంలోని ఆలయాలను సందర్శించారు. 

మహాబలిపురం: చెన్నై కనెక్ట్' భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి నాంది పలకనుందని శుక్రవారం చైనా ప్రధాని తో జరిగిన అనధకారిక సమావేశం తరువాత భారత ప్రధాని మోది అన్నారు. ఇరు ప్రధానులు శుక్రవారం ఇప్పుడు మమల్లాపూర్ గా పిలవబడుతున్న మహాబలిపురంలోని ఆలయాలను సందర్శించారు. 

ఆ తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం రాత్రి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ప్రధాని జిన్ పింగ్ మాట్లాడుతూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడే అనేక అంశాలపై చర్చించామని అన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో తీవ్రవాదంపై ఇరు దేశాలు కలిసి సమిష్ఠిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు.

చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. 

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ఈ పర్యటనను తానెన్నటికి మరువలేనన్నాడు. ఈ ఆతిథ్యం ఆయనను, ఆయన సిబ్బందిని మైమరిచిపోయేలా చేసిందని జిన్ పింగ్ అన్నారు. ఈ పర్యటన తన జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని జిన్ పింగ్ అభిప్రాయపడ్డాడు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు సాగాయని, ఇవి ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తాయన్న అభిప్రాయాన్ని జిన్ పింగ్ వెలిబుచ్చారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?