ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published : Jul 14, 2022, 10:57 PM ISTUpdated : Jul 14, 2022, 11:03 PM IST
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సారాంశం

ఢిల్లీ నుంచి వడోదరకు బయల్దేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గంమధ్యలో జైపూర్‌లోనే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఇంజిన్‌లో వైబ్రేషన్ వచ్చినట్టు తెలిసింది. అందుకే ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంజిన్‌లో వైబ్రేషన్ వచ్చాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా మార్గంమధ్యలో జైపూర్‌లోనే ల్యాండింగ్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది.

ఢిల్లీ నుంచి వడోదరకు ఇండిగో విమానం 6E-859 బయల్దేరింది. అయితే, ఫ్లైట్ గాల్లోకి లేసిన కొద్ది సేపటికి, గమ్యస్థానం చేరముందే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.

అయితే, ఈ కారణం చేత విమాన ఇంజిన్‌లో వైబ్రేషన్ వచ్చిన విషయం తెలియరాలేదు. అలాగే, ఈ సమయంలో విమానంలో ఎంత మంది ఉన్న విషయాన్నీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇంకా వెల్లడించలేదు.

సాంకేతిక సమస్యలతో ఇటీవలే స్పైస్ జెట్ వరుసగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం 18 రోజుల్లో 8 విమానాల్లో సాాంకేతిక లోపాలు వచ్చాయి. దీంతో ఈ నెల 6వ తేదీన స్పైస్‌జెట్ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్నిరోజులుగా ఈ సంస్థకు చెందిన విమానాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగుచూడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 

కాగా.. ఈ నెల 5వ తేదీన ఉదయం దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య త‌ల్లెత్త‌డంతో అత్యవసరంగా.. ఆ విమానాన్ని కరాచీ వైపు మ‌ళ్లీంచారు. కరాచీ విమానాశ్రయ‌లో ల్యాండ్​ చేశారు. ఈ ఘటన జ‌రిగిన మ‌రో కొద్ది గంట‌ల్లోనే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేయ‌బ‌డింది. కాండ్లా-ముంబై విమానంలో విండ్​షీల్డ్​ దెబ్బతినడం వల్ల ముంబయిలో ల్యాండ్​ చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ప్రమాాదంతోపాటు.. గత 17 రోజుల్లో.. 7 సార్లు స్పైస్‌జెట్ విమానాలు సాంకేతిక లోపంతో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?