ప్రపంచ సమస్యల పరిష్కార కర్తగా భారత్: విదేశాంగ మంత్రి  

By Rajesh KarampooriFirst Published Jan 1, 2023, 12:42 AM IST
Highlights

ఐక్యరాజ్యసమితి తరపున సేవలందిస్తున్న భారత శాంతి పరిరక్షకుల పాత్రను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రశంసించారు. భారతదేశం , సైప్రస్ తమ దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. అటువంటి పరిస్థితిలో మంత్రి జైశంకర్ తొలిసారి సైప్రస్‌లో పర్యటిస్తున్నారు.

భారతదేశం నేడు బలమైన ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచ సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న దేశంగా ఆవిర్భవించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. సైప్రస్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుందని అన్నారు. భారతదేశం ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఎదిగిందని, అవసరం వచ్చినప్పుడు సరైన దాని కోసం నిలబడే ధైర్యం ఉందని అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేలా ప్రజలను మనం ప్రేరేపించగలమని అన్నారు. సైప్రస్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇది. భారతదేశం యొక్క వైవిధ్యాన్ని ప్రపంచం అర్థం చేసుకునే, మెచ్చుకునే విధంగా భారతదేశం G20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తుందని విదేశాంగ మంత్రి అన్నారు.

కరోనా సమయంలోనూ మెరుగైన సేవలు 

ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్కరణలు, కోవిడ్ సంక్షోభం గురించి విదేశాంగ మంత్రి మాట్లాడారు. అయితే కోవిడ్ చాలా కష్టమైన కాలం అని ఆయన అన్నారు. అయినప్పటికీ.. కోవిడ్‌ను ఎదుర్కోవడంతోపాటు, ఈ సంక్షోభ సమయంలో తాము ఆరోగ్య సేవలు, ప్రభుత్వ సేవలను నిర్వహించమని తెలిపారు. నిరుపేదలకు ఆహార-ఆర్థిక సహాయాన్ని అందించమని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మూడు-నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వచ్చినప్పుడు, వారు కొత్త భారతదేశాన్ని చూస్తున్నారని ఆయన చెప్పారు.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న  వైఖరిపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారతమాత బిడ్డలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, అక్కడ గొప్ప శక్తి ఉందన్నారు. గత ఏడెనిమిదేళ్లలో ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా భారతీయులెవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు భారత ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని తెలిపారు.నేడు తాను బలమైన దేశానికి, పెద్ద ఆర్థిక వ్యవస్థకు లేదా గ్లోబల్ పాలసీలో నిమగ్నమైన దేశానికి ప్రతినిధి మాత్రమే కాదని, పౌరుల పట్ల శ్రద్ధ వహించే, వారిని రక్షించడానికి ఎటువంటి పరిస్థితి వదిలిపెట్టని దేశానికి ప్రతినిధి అని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారి శ్రేయస్సు కోసం చూస్తుందని తెలిపారు. 

click me!