ఇండియాలో కరోనా జోరు: 63.94 లక్షలకు చేరిక

By narsimha lodeFirst Published Oct 2, 2020, 11:15 AM IST
Highlights

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 81,484 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 63 లక్షల94 వేల069కి చేరుకొన్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 81,484 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 63 లక్షల94 వేల069కి చేరుకొన్నాయి.

దేశంలో 9 లక్షల 42 వేల 217 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా చికిత్స పొందిన 53 లక్షల 52 వేల078 మంది కోలుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు ప్రకటించింది.

కోవిడ్ తో దేశంలో మొత్తం మృతి చెందినవారి సంఖ్య 99 వేల 773కి చేరుకొంది.  గత 24 గంటల్లో 10 లక్షల 97  వేల 747 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే  84 వేల 484 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.దేశంలో ఇప్పటివరకు 7,67,17,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా కేంద్రం తెలిపింది. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో 144 సెక్షన్ ను అమల్లోకి తెచ్చింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడదని ప్రభుత్వం ఆదేశించింది.

click me!