నేవీలో తొలిసారిగా విమెన్ సెయిలర్ల నియామకం.. అగ్నివీర్ స్కీమ్ కింద 341 మంది మహిళలు రిక్రూట్‌మెంట్

By Mahesh KFirst Published Dec 3, 2022, 6:20 PM IST
Highlights

భారత నావికా దళంలోకి తొలిసారిగా మహిళా సెయిలర్లను రిక్రూట్ చేసుకున్నట్టు నావల్ స్టాఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. అగ్నిపథ్ పథకం కింద ఇప్పటి వరకు 3000 మందిని రిక్రూట్ చేసుకోగా అందులో 341 మంది విమెన్ సెయిలర్లు అని చెప్పారు.
 

న్యూఢిల్లీ: భారత నావికా దళంలోకి తొలిసారి మహిళా సెయిలర్లను తీసుకున్నారు. నేవీలోకి మహిళల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నది. కానీ, సెయిలర్లుగా తీసుకోవడం ఇదే తొలిసారి. ఇదొక కీలక మైలురాయి అని నావల్ స్టాఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ ఈ రోజు వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. నేవీలోని అన్ని విభాగాల్లో అధికారులుగా వారిని నియమించుకుంటామని చెప్పారు.

అగ్నివీర్ పథకం కింద భారత నావికా దళం ఇప్పటి వరకు సుమారు 3000 మందిని రిక్రూట్ చేసుకుంది. ఇందులో 341 మంది మహిళలు అని అడ్మైరల్ ఆర్ హరి కుమార్ వివరించారు. తొలిసారి ఇండియన్ నేవీ విమెన్ సెయిలర్లను రిక్రూట్ చేసుకుందని తెలిపారు. 

నేవీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ నేవీ కూడా ఆత్మ నిర్భర్ అవుతుందని అన్నారు. 2047 కల్లా భారత నావికా దళం స్వయం సమృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం తమకు స్పష్ట మైన గైడ్‌లైన్స్ ఇచ్చిందని చెప్పారు. 

Also Read: 2047 నాటికి భారత నౌకాదళం 'ఆత్మనిర్భర్' గా మారుతుంది: నావల్ చీఫ్ హరి కుమార్

భారత  నావికా దళం గడిచిన ఏడాది కాలంలో హై ఆపరేషనల్ టెంపోను సాధించిందని అన్నారు. నావికా సంబంధ భద్రతలో ఇండియన్ నేవీ ఎంతో పటిష్టతను సాధంచిందని వివరించారు. భారత సముద్ర జలాల్లో చైనా మిలిటరీ, రీసెర్చ్ వెస్సెల్స్ కదలికలపై కన్నేసి ఉంచిందని తెలిపారు.

click me!