భారత్‌లో చొరబడేందుకు 4 వేలమంది: పీవోకే‌లో హైఅలర్ట్

By Siva KodatiFirst Published Oct 4, 2019, 3:31 PM IST
Highlights

నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది

నియంత్రణ రేఖ వెంబడి అలజడికి పాకిస్తాన్ కుట్ర పన్నినట్లు తెలియడంతో కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

పాకిస్తాన్ సైన్యం, జమాత్ ఉల్ అల్ హదీప్ సంస్థ సంయుక్తంగా 4 వేల మంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. శిక్షణ పొందిన వారంతా ఎల్వోసి దాటి భారత్‌లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి.

వీరితో పాటు మరికొందరు యువకులకు రావల్పిండిలోని సైనిక స్థావరంలో 4 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు సరిహద్దులు దాటేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు సహకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అయితే పాక్ ఎటువంటి దాడులకు పాల్పడినా వాటిని తిప్పికొడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే భారత భూభాగంపై ఏ మాత్రం అలజడి రేగినా బాలాకోట్ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని భారత సైన్యం పాక్‌ను హెచ్చరించింది.     

click me!