బాడ్మింటన్ లెజెండ్ నందు నెటేకర్ ఇక లేరు..

Published : Jul 28, 2021, 11:33 AM IST
బాడ్మింటన్ లెజెండ్ నందు నెటేకర్ ఇక లేరు..

సారాంశం

బ్యాడ్మింటన్ లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రధానం చేసింది. 1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు.

న్యూ ఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ లెజెండ్ నందు నెటేకర్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 88 ఏళ్ళ నందు బ్యాడ్మింటన్ కోర్టులో వీరోచితంగా ఆడి పలు విజయాలు సాధించారు. 

1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం సాధించారు. నందు 1950లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. 

బ్యాడ్మింటన్ లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రధానం చేసింది. 1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. నేటేకర్ కుమారుడు గౌరవ్ భారతదేశ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.  గౌరవ్ 1994లో ఆసియా గేమ్స్ లో బంగారు పతకం సాధించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌