సిక్కింలో భారీ హిమపాతం.. ఇద్దరు భారత సైనికులు మృతి

By telugu news teamFirst Published May 15, 2020, 9:07 AM IST
Highlights

సైనికుల బృందం మంచును తొలగిస్తూ పెట్రోలింగ్ చేస్తుండగా హిమపాతం సంభవించింది. మంచులో కూరుకుపోయి ఒక ఆర్మీ ఆఫీసరుతోపాటు ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. 

నార్త్ సిక్కిం సరిహద్దుల్లోని మంచుకొండల్లో భారీ హిమపాతం సంభవించింది. కాగా.. ఈ హిమపాతంలో  చిక్కుకొని ఇద్దరు భారత సైనికులు మరణించారు. భారత సైనిక విభాగానికి చెందిన 18 మంది సైనికులు లుగ్నాక్ లా పాస్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. 

సైనికుల బృందం మంచును తొలగిస్తూ పెట్రోలింగ్ చేస్తుండగా హిమపాతం సంభవించింది. మంచులో కూరుకుపోయి ఒక ఆర్మీ ఆఫీసరు( ఇండియన్ లెఫ్టినెంట్ కల్నల్) తోపాటు ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. హిమపాతంలో చిక్కుకున్న మిగతా సైనికులను మరో సైనిక బృందం రక్షించింది. 

మరణించిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ రాబర్ట్ సైనికుడు షణ్ముఖరావులున్నారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్ లోని గండర్ బల్ జిల్లాలో సంభవించిన హిమపాతంలో శిథిలాల్లో కూరుకుపోయిన సైనికులను కాపాడారు. గతంలో శ్రీనగర్-కార్గిల్ రహదారిలో గగంగీర్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం వల్ల నలుగురు పౌరులు చిక్కుకున్నారు. 

click me!