Gujarat ByPoll Exit Polls: ఇండియా టుడే సర్వే: బీజేపీకే జనం పట్టం

Siva Kodati |  
Published : Nov 07, 2020, 08:45 PM ISTUpdated : Nov 07, 2020, 10:00 PM IST
Gujarat ByPoll Exit Polls: ఇండియా టుడే సర్వే: బీజేపీకే జనం పట్టం

సారాంశం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు నవంబర్-3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు నవంబర్-3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7 స్థానాలకు, ఒడిషాలోని 2 స్థానాలకు, నాగాలాండ్ లోని 2 స్థానాలకు, కర్ణాటకలోని 2 స్థానాలకు, జార్ఖండ్ లోని 2 స్థానాలకు, తెలంగాణలోని 1 స్థానానికి, ఛత్తీస్‌ఘడ్ లోని 1 స్థానానికి, హర్యానాలోని 1 స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

ఇందుకు సంబంధించి దేశంలోని ప్రముఖ వార్తా ఛానెళ్లు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాలకు గాను ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్లుగా తేలింది.

కాంగ్రెస్ పార్టీ సైతం హోరాహోరీగా పోరాడినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం ఓట్లు పడొచ్చని సర్వే అంచనా వేసింది.

ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీదే పైచేయిగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 49 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 40 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు దక్కే అవకాశముందని ఇండియా టుడే వెల్లడించింది. 


ఇండియా టుడే సర్వే:

బీజేపీ: 6-7
కాంగ్రెస్: 0-1
ఇతరులు: 0
 

PREV
click me!

Recommended Stories

Delhi: ఆగ‌స్టు 4వ తేదీన ప్ర‌ధాని నివాసానికి మార్చ్‌.. మ‌రో ఉద్య‌మానికి సిద్ధం
PM Modi: త‌న త‌ల్లిని దూషించిన వారిపై మోదీ రియాక్ష‌న్‌.. ఆలోజింప‌చేస్తున్న ప్ర‌ధాని మాట‌లు