Power outage:పెరుగుతున్న విద్యుత్ కోత‌లు.. త‌రుగుతున్న బొగ్గు నిల్వ‌లు !

Published : Apr 23, 2022, 11:48 AM IST
Power outage:పెరుగుతున్న విద్యుత్ కోత‌లు.. త‌రుగుతున్న బొగ్గు నిల్వ‌లు !

సారాంశం

Power outage in india: ప్ర‌స్తుతం దేశంలోని అనేర రాష్ట్రాల్లో విద్యుత్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తక్కువ బొగ్గు నిల్వల మధ్య విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాయి.  

Power outage in multiple states:  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం విద్యుత్ కోత‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తక్కువ బొగ్గు నిల్వల మధ్య విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్ర‌జ‌ల మ‌రింత‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.  ఇప్ప‌టికే దేశంలో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగింది. ఇదే స‌మ‌యంలో విద్యుత్ డిమాండ్ కూడా మ‌రింత ఎక్కువైంది. మండుతున్న ఎండ‌లు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. భారతదేశంలోని 150కి పైగా విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (Central Electricity Authority of India-CEA) ప‌ర్య‌వేక్షిస్తున్న 173 పవర్ ప్లాంట్ల‌ బొగ్గు నిల్వలు 21.93 మిలియన్ టన్నుల (MT) వద్ద ఉన్నాయి. ఇది నోమురా నివేదిక ప్రకారం ఏప్రిల్ 21 నాటికి రెగ్యులేటరీకి అవసరాలైన 66.32 MT కంటే తక్కువగా ఉన్నాయి. 2014 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బొగ్గు నిల్వలు 9 రోజులకు పడిపోయాయని, కేంద్రం నిర్దేశించిన 24 రోజుల విలువైన నిల్వలతో పోలిస్తే బొగ్గు నిల్వలు 9 రోజులకు పడిపోయాయని మీడియా నివేదికలు సూచించాయి. ఒక వైపు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా రోజువారీ బొగ్గు నివేదిక ప్రభుత్వ యాజమాన్యంలోని 150 విద్యుత్ ప్లాంట్లలో 81 ప‌వ‌ర్ ప్లాంట్ల వ‌ద్ద బొగ్గు నిల్వలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొంటున్నాయి. మరోవైపు విద్యుత్ డిమాండ్ క్ర‌మంగా పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. 2019 లో  విద్యుత్ డిమాండ్ 106.6 బిలియన్ యూనిట్లు (బీయూ) నుండి 2021 లో 124.2 బీయూల‌కు పెరిగింద‌ని సీఈఏ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 2021లో విద్యుత్ డిమాండ్ 124.2 నుంచి 2022 లో 132 బిలియ‌న్ యూనిట్ల‌కు పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

"దేశంలో విద్యుత్ ఉత్ప‌త్తికి కావాల్సిన బొగ్గు కొరత ఉంది. ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మార‌క‌పోయిన‌ప్ప‌టికీ.. వేస‌వి కాలం ప్రారంభం నుంచి ఎండ‌ల తీవ్ర‌గా అధికం కావ‌డంతో విద్యుత్ డిమాండ్‌ను విపరీతంగా పెంచింది. డిమాండ్-సరఫరా అంతరాన్నిమ‌రింత‌ పెంచింది" అని విద్యుత్ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. కాగా, ఇప్ప‌టికే పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండడంతో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. అంతకుముందు శుక్రవారం.. మహారాష్ట్ర ప్రభుత్వం బొగ్గును దిగుమతి చేసుకోవాలని మరియు విద్యుత్ ఉత్పత్తి కోసం చత్తీస్‌గఢ్ నుండి బొగ్గు గనిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.  "డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో బొగ్గు సరఫరా కావడం లేదు. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య దాదాపు 3,500 మెగావాట్ల నుంచి 4,000 మెగావాట్ల లోటును తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి వస్తోంది" అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబ‌యిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 

గత వారం, రాష్ట్ర మంత్రివర్గం ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ఇతర ప్రాంతాల నుండి విద్యుత్ కొనుగోలు చేయడానికి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కో లిమిటెడ్‌కు అధికారం ఇచ్చింది. కేంద్రం ద్వారా వివిధ రాష్ట్రాలకు సరిపడా బొగ్గు సరఫరా అవుతోందని, మహారాష్ట్రకు కూడా అవసరమైన పరిమాణంలో లభించడం లేదని, అయితే విద్యుత్ సరఫరా సజావుగా ఉండేలా, కొనసాగుతున్న విద్యుత్ కోతలను అంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పవార్ పునరుద్ఘాటించారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కోసం రైల్వే రేకుల కొరత కారణంగా బొగ్గు కొరత మరింత పెరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour