ఇండియాలో 12,380 కరోనా కేసులు: మరణాల సంఖ్య 414

By telugu teamFirst Published Apr 16, 2020, 9:05 AM IST
Highlights
భారతదేశంలో గత 24 గంటల్లో 37 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దాంతో మృతుల సంఖ్య 414కు చేరుకుంది. కాగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 12 వేలకు చేరుకుంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా 414 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 37 మరణాలు సంభవించాయి. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు దేశంలోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. ఇందులో ఆరు మెట్రో నగరాలు ఉన్నాయి. 123 జిల్లాల్లో పెద్ద యెత్తున కరోనా వైరస్ వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 

ముంబై, కోల్ కతా, బెంగళూరు అర్బన్ 9 జిల్లాలు, హైదరాబాదు, చెన్నై, జైపూర్, ఆగ్రాలు హాట్ స్పాట్స్ గా గుర్తించినవాటిలో ఉన్నాయి. హాట్ స్పాట్లలో ఈ నెల 20వ తేదీ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.34 లక్షల మంది మరణించారు. 5.09 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
click me!