దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Published : Jun 12, 2022, 11:58 AM IST
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

సారాంశం

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,22,017కి చేరింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,22,017కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 3,16,179 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 8,582 మంది పాజిటివ్‌గా తేలినట్టుగా తెలిపింది. కిందటి రోజు దేశంలో కొత్తగా 8,329 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఇక, గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,761కి పెరిగింది. తాజాగా కరోనా నుంచి 4,435 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,52,743కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 44,513 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య.. 0.10 శాతంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇక, కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 2.71 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.02 శాతంగా ఉంది. 

భారత్​లో శనివారం 13,04,427 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,07,08,541కు చేరింది. 

భారతదేశంలో కరోనా కేసుల డేటాను పరిశీలిస్తే.. దేశంలో కేసలు సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌ను దాటింది. అదే ఏడాది సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. ఇక, 2021 మే 4న దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల మార్క్‌ను, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం