ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 27, 2021, 10:22 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో  50,040 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1258 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో  50,040 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 1258 మంది మరణించారు. శనివారం నాడు ఒక్క రోజే 17,77,309 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 50,040 మందికి కరోనా సోకిందని తేలింది.  గత 24 గంటల్లో  57,944 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి  2,92,51,029 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ 96.75 శాతానికి చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,95, 751కి చేరుకొంది. 

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,403కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.94 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 64.25 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు.దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కూడ భావిస్తోంది.


 

click me!