ఇండియాలో కలవరపెడుతున్న కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే అధికం

Published : Aug 06, 2021, 09:51 AM IST
ఇండియాలో కలవరపెడుతున్న కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే అధికం

సారాంశం

 ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రికవరీ కంటే కొత్త కేసులే అధికంగా నమోదౌతున్నాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 464 మంది మరణించారు.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 44,643 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 464 మంది మరణించారు.దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.26 లక్షల మంది మరణించారు.దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 4,14,159కి చేరుకొన్నాయి. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతి అధికంగా ఉంది. 

నిన్న ఒక్క రోజు కరోనా నుండి 41,096 మంది కోలుకొన్నారు. .కరోనా నుండి కోలుకొన్న రోగుల కంటే కొత్త కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి 3.10 కోట్లకు చేరుకొన్నాయి.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1.30 శాతంగా నమోదైనట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.వారంతపు కరోనా పాజిటివిటీ రేటు 2.40 శాతంగా నమోదైంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.72 శాతంగా నమోదయ్యాయి.గత 11 రోజులుగా కరోనా పాజిటివిటీ రేటు 2.72 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
కేరళను ముంచెత్తిన వరదలు రోడ్లపై పడవలు | Kerala Floods 2026 Boats on Roads After Heavy Rains